2022-06-03 07:31:58.0
హైదరాబాద్ నుంచి గోవాకు ఓ పుట్టిన రోజు వేడుక కోసం బస్సులో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురై ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే. కర్నాటకలోని కలబురిగి జిల్లా కమలాపుర పట్టణ శివారులో ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా హైదరాబాద్‌కు చెందిన వారే కావడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సమాచారం తెలిసిన వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కర్నాటక అధికారులతో సమన్వయం చేసుకుంటూ […]
హైదరాబాద్ నుంచి గోవాకు ఓ పుట్టిన రోజు వేడుక కోసం బస్సులో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురై ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే. కర్నాటకలోని కలబురిగి జిల్లా కమలాపుర పట్టణ శివారులో ఈ ప్రమాదం జరిగింది.
మృతులంతా హైదరాబాద్‌కు చెందిన వారే కావడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సమాచారం తెలిసిన వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
కర్నాటక అధికారులతో సమన్వయం చేసుకుంటూ క్షతగాత్రులకు సరైన వైద్యం అందేలా చూడాలని సీఎం ఆదేశించారు. మృతదేహాలను ఘటనా స్థలం నుంచి వారి స్వస్థలాలకు చేర్చడంతో పాటు, గాయపడిన వారికి వైద్యం అందించే చర్యలను పర్యవేక్షించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌కు అప్పగించారు.
ఇక ఈ ప్రమాదంలో మరణించిన ఒక్కొక్కరికి రూ. 3 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని వారి కుటుంబ సభ్యులకు అందించనున్నారు. గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
కాగా, కోంపల్లికి చెందిన అర్జున్ కుమార్ అనే వ్యక్తి తన కూతురుపుట్టిన రోజు వేడుకల కోసం బంధుమిత్రులందరికీ అల్వాల్, షేక్‌పేట్, మణికొండ నుంచి గోవాకు ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో టికెట్లు బుక్ చేశాడు. ఈ ప్రమాదంలో అర్జున్ కుమార్, అతని భార్య (32), బివాన్ (4), దీక్షిత్ (9), అనితా రాజు (40), శివకుమార్ (35), రవళి (30)తో పాటు మరొకరు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.