బాంద్రా టెర్మినల్‌ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట

2024-10-27 05:59:20.0

ఈ ఘటనలో 9 మందికి గాయాలు..ఇద్దరి పరిస్థితి విషమం

https://www.teluguglobal.com/h-upload/2024/10/27/1372943-bandra-railway-station.webp

బాంద్రా టెర్మినల్‌ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట చోటుచేసుకున్నది. ఈ ఘటనలో 9 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌ పైకి భారీగా ప్రయాణికులు ఒక్కసారిగా రావడంతో ఈ ఘటన చోటుచేసుకున్నది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రైల్వే అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

దీపావళి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లడానికి వచ్చిన ప్రయాణికులతో రైల్వేస్టేషన్‌ కిక్కిరిసిపోయింది. బాంద్రా నుంచి గోరఖ్‌పూర్‌కు వెళ్లే రైలు ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌పైకి రాగానే ప్రయాణికులు ఒక్కసారిగా పోటెత్తారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకున్నది. ఈ ఘటనలో గాయపడిన ప్రయాణికులను రైల్వే సిబ్బంది స్ట్రెచర్‌పై ఆస్పత్రికి తరలించిన దృశ్యాలను పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. 

Stampede,Bandra Terminus,9 injured,Amid heavy rush