https://www.teluguglobal.com/h-upload/2025/01/04/1391507-6-dead-in-explosion.webp
2025-01-04 07:40:31.0
పేలుడు ధాటికి కర్మాగార భవనంలోని కొన్ని రూమ్‌లు పూర్తిగా ధ్వంసం
తమిళనాడులో బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. పేలుడు ధాటికి కర్మాగార భవనంలోని కొన్ని రూమ్‌లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. విరుద్‌నగర్‌లోని సాయినాథ్ బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం ఉదయం ఒక్కసారిగా పేలుడు సంభవించింది. చుట్టుపక్కల ఒకటిన్నర కిలోమీటర్ల దూరం వరకు పేలుడు శబ్దాలు వినిపించాయి. స్థానికుల సమాచారంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, శిథిలాల కింద ఉన్న మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవ పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. రసాయనాలను కలిపే ప్రక్రియలో పేలుడు సంభవించి ఉంటుందని భావిస్తున్నారు. మృతులకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంతాపం తెలిపారు.
6 Dead In Explosion,At Fireworks Factory,In Tamil Nadu,Virudhnagar,Chief Minister MK Stalin condoled