https://www.teluguglobal.com/h-upload/2024/02/17/1298804-fire-cracker.webp
2024-02-17 12:48:34.0
ఓ బాణసంచా తయారీ పరిశ్రమలో శనివారం భారీ పేలుళ్లు సంభవించి అందులో పనిచేస్తున్న 10 మంది కార్మికులు మృతిచెందారు.
బాణసంచా తయారీకి పేరెన్నికగన్న శివకాశీలో భారీ ప్రమాదం సంభవించింది. ఓ బాణసంచా తయారీ పరిశ్రమలో శనివారం భారీ పేలుళ్లు సంభవించి అందులో పనిచేస్తున్న 10 మంది కార్మికులు మృతిచెందారు. మరో ఆరుగురు గాయాలపాలయ్యారు. ప్రమాదం జరిగిన పరిశ్రమలో మొత్తం 200 మంది కార్మికులు పనిచేస్తున్నట్టు సమాచారం.
తమిళనాడు విరుదునగర్ జిల్లా శివకాశిలో జరిగిన ఈ ప్రమాదంలో పేలుడు ధాటికి పరిశ్రమ పక్కనే ఉన్న రెండు భవనాలు నేలమట్టమయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. పేలుడు సమయంలో పరిశ్రమలో చిక్కుకున్నవారిని బయటికి తీసుకురావడానికి, మంటలార్పడానికి అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు.
నిబంధనలకు విరుద్ధంగా మితిమీరిన రసాయన ముడి పదార్థాలను నిల్వ చేయడం వల్లే ఈ పేలుడు జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదంపై పూర్తి నివేదిక సమర్పించాలని విరుదునగర్ జిల్లా కలెక్టర్ జయశీలన్ అధికారులను ఆదేశించారు. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
Tamil Nadu,Sivakasi,Fire Accident,fire crackers