2025-01-24 14:31:16.0
రూ.83 వేల మార్క్ దాటేసిన 10 గ్రాముల ధర
కొన్నాళ్లుగా పెరుగుతూ వస్తోన్న బంగారం ధర శుక్రవారం మరింత పెరిగింది. ఇండియన్ బులియన్ మార్కెట్‌లో మొదటిసారిగా 10 గ్రాముల బంగారం రూ.83 వేల మార్క్ దాటేసింది. ఢిల్లీలో శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.83,100కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులతోనే బంగారం ధర అమాంతం పెరిగినట్టుగా మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. 99.9 పర్సెంట్ ప్యూరిటీ గల గోల్డ్ పది గ్రాముల ధర రూ.83,100 ఉండగా, 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం పది గ్రాముల ధర రూ.82,700 ఉన్నట్టుగా మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింతగా పెరగడం ఖాయమని కూడా చెప్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 2,780 అమెరికన్ డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
Bullion Market,Gold Price,10 Grams Rs.83,100,Indian Market