2025-03-01 07:52:45.0
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎత్తివేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 0.6 టీఎంసీల నీటిని విడుదల చేసిన అధికారులు
https://www.teluguglobal.com/h-upload/2025/03/01/1407699-babli-project-gates-lifted.webp
గోదావరి నదిపై మహారాష్ట్ర చేపట్టిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎత్తివేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 0.6 టీఎంసీల నీటిని అధికారులు విడుదల చేశారు. నీటిని వదిలిన తర్వాత ప్రాజెక్టు గేట్లను మూసివేయనున్నారు. సీడబ్ల్యూసీ తెలంగాణ, మహారాష్ట్ర ఇంజినీర్ల సమక్షంలో దిగువకు నీటిని విడుదల చేశారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Babli project,Gates Lifting,Orders of Supreme Court,0.6 TMC of water,Sriramsagar project