బాలికలతో పాడు పనులు.. కీచక టీచర్‌కు దేహశుద్ధి

2024-08-09 06:57:15.0

విషయాన్ని ఓ తండ్రి గమనించి కుమార్తెను ప్రశ్నించాడు. దీంతో అసలు విషయం బయటపడింది. కొందరు తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి రవికుమార్‌ను చితకబాదారు. అడ్డుకునేందుకు యత్నించిన హెడ్‌మాస్టర్‌కు సైతం దేహ‌శుద్ధి చేశారు.

https://www.teluguglobal.com/h-upload/2024/08/09/1351000-principal-2-teachers-suspended-at-model-school-in-palnadu-district.webp

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థినులతో అమానుషంగా ప్రవర్తించాడు. బాలికలు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో బాగోతం బయటపడింది. తల్లిదండ్రులంతా పాఠశాలకు వచ్చి కీచక టీచర్‌కు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన పల్నాడు జిల్లా కారంపూడిలోని మోడల్‌ స్కూల్లో జరిగింది.

బి. రవికుమార్‌ ఆదర్శ మోడల్‌ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్. ఇతను బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ల్యాబ్‌కు పిలిపించి తాకరాని చోట తాకుతున్నాడు. రాత్రి బాలికలకు మెసేజ్‌లు చేస్తున్నాడు. ఈమధ్య 9వ తరగతికి చెందిన ఐదుగురు విద్యార్థినులతో ఇలాగే ప్రవర్తించాడు. విషయాన్ని ఓ తండ్రి గమనించి కుమార్తెను ప్రశ్నించాడు. దీంతో అసలు విషయం బయటపడింది. కొందరు తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి రవికుమార్‌ను చితకబాదారు. అడ్డుకునేందుకు యత్నించిన హెడ్‌మాస్టర్‌కు సైతం దేహ‌శుద్ధి చేశారు.

విద్యాశాఖ ఉన్నతాధికారులు పాఠశాలకు చేరుకుని విచారణ చేశారు. టీచర్‌ రవికుమార్, హెడ్‌మాస్టర్‌ నయోమి, వైస్‌ ప్రిన్సిపల్‌ శుభశ్రీలను సస్పెండ్‌ చేశారు. కీచక ఉపాధ్యాయుడికి సహకరించిన జూనియర్‌ అసిస్టెంట్‌ ఖాజావలి, బాలికల వసతిగృహ వార్డెన్‌ నాగలక్ష్మిని సర్వీసు నుంచి తొలగించారు. బాధిత విద్యార్థినుల ఫిర్యాదుతో పోలీసులు టీచర్ రవికుమార్‌ను అరెస్ట్ చేశారు.