బాలీవుడ్‌ నటుడు గోవిందకు బెల్లెట్‌ గాయాలు

 

2024-10-01 04:21:11.0

https://www.teluguglobal.com/h-upload/2024/10/01/1364805-govinda.webp

ప్రమాదవశాత్తూ గన్‌ మిస్‌ఫైర్‌ ..కాలులోకి దూసుకెళ్లిన బుల్లెట్‌

బాలీవుడ్‌ నటుడు గోవిందకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదవశాత్తూ ఇంట్లో గన్‌ మిస్‌ఫైర్‌ కావడంతో ఆయన కాలులోకి బుల్లెట్‌ దూసుకెళ్లింది. దీంతో గోవింద కాలుకు తీవ్ర గాయమైంది. ఇది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నదని డాక్టర్లు వెల్లడించారు.

మంగళవారం ఉదయం ఆయన ఇంటి నుంచి కోల్‌కతాకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నది. లెసెన్స్‌డ్‌ రివాల్వర్‌ తీసుకెళ్తుండగా అది చేతి ఉంచి జారి కింద పడింది. దీంతో తుపాకీ పేలి కాలిలోకి బుల్లెట్‌ దూసుకెళ్లింది. వెంటనే వైద్యులు ఆయనకు చికిత్స అందించి బుల్లెట్‌ను తొలిగించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, కొన్నిరోజుల ఆస్పత్రిలో ఉంటారని గోవింద మేనేజర్‌ తెలిపారు. 

 

Actor Govinda,Gets Shot,Gun Misfires,Rushed To Hospital