2024-06-23 16:05:48.0
https://www.teluguglobal.com/h-upload/2024/06/23/1338736-allu-arjun-prabhas.webp
Allu Arjun about Prabhas – బన్నీ-ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. మరి ప్రభాస్ గురించి అల్లు అర్జున్ ఏం చెబుతున్నాడు?
ప్రభాస్ ఆజానుబాహుడు మాత్రమే కాదు, అజాతశత్రువు కూడా. అందర్నీ డార్లింగ్ అని పిలవడం ప్రభాస్ కు అలవాటు. కానీ అందరికీ కామన్ డార్లింగ్ అతడు. కొంతమంది హీరోల మధ్య వైషమ్యాలు ఉండొచ్చు. కానీ ప్రభాస్ తో ఏ హీరోకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
అతడో స్వీట్ పర్సన్ అంటాడు అల్లు అర్జున్. కొన్నేళ్లుగా ప్రభాస్ తో స్నేహబంధం కొనసాగిస్తున్న అల్లు అర్జున్… అప్పటికీ ఇప్పటికీ ప్రభాస్ లో ఏమాత్రం తేడా రాలేదన్నాడు. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన తర్వాత కూడా అదే యాటిట్యూడ్ కొనసాగించడం ప్రభాస్ లో గొప్పదనం అంటున్నాడు.
సాధారణంగా తను మెగా కాంపౌండ్ హీరోలను మాత్రమే అభిమానిస్తానని.. కానీ కాంపౌండ్ దాటి బయటకొస్తే, ప్రభాస్ కు తను వీరాభిమానినని తెలిపాడు బన్నీ. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం, చేతనైనంత సహాయం చేయడం ప్రభాస్ లో మంచి గుణాలుగా చెప్పుకొచ్చాడు.
సినిమా కోసం అతడు చూపించే అంకితభావం ఒక్కోసారి తనను ఆశ్చర్యానికి గురిచేస్తుందని అన్నాడు బన్నీ. బాహుబలి ఫ్రాంచైజీ చేస్తున్నప్పుడు ఎన్నో ఆఫర్లు వచ్చాయని, కానీ ఒక్క సినిమా కోసం ఐదేళ్లు అలా ఆగిపోయాడని, అలా అంకితభావంతో ఉండడం చాలా కష్టం అంటున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రభాస్ ను 6 అడుగుల బంగారంగా అభివర్ణిస్తున్నాడు అల్లు అర్జున్.
Allu Arjun,Prabhas,Kalki 2898 AD