https://www.teluguglobal.com/h-upload/2023/03/24/500x300_728102-240305.webp
2023-03-24 05:25:23.0
హైదరాబాద్ కేంద్రంగా 12 మంది బిలియనీర్లు (కనీస సంపద 1 బిలియన్ డాలర్లు) ఈ సారి లిస్టులో చోటు సంపాదించారు. ఇందులో ఏడుగురు ఫార్మా రంగానికి చెందిన వాళ్లే ఉండటం విశేషం.
ప్రపంచ బిలియనీర్ల లిస్టును రూపొందించే అతిపెద్ద సంస్థ ‘హ్యూరన్’ తమ 12వ వార్షికోత్సవం సందర్భంగా కొత్త లిస్టు విడుదల చేసింది. హ్యూరన్ ఎం3ఎం 2023 లిస్టును విడుదల చేయగా.. ఇందులో ఇండియాకు చెందిన బిలియనీర్లు చాలా మంది చోటు దక్కించుకున్నారు. ఇండియాలో అత్యధిక బిలియనీర్లు ముంబైలో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో న్యూఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ ఉన్నాయి. ప్రపంచంలో ప్రతీ వారం ఐదుగురు బిలియనీర్లు తమ సంపదను కోల్పోతుండగా.. హైదరాబాద్‌కు చెందిన బిలియనీర్లు మాత్రం సంపదను పెంచుకున్నట్లు ఆ లిస్టులో పేర్కొన్నారు.
హైదరాబాద్ కేంద్రంగా 12 మంది బిలియనీర్లు (కనీస సంపద 1 బిలియన్ డాలర్లు) ఈ సారి లిస్టులో చోటు సంపాదించారు. ఇందులో ఏడుగురు ఫార్మా రంగానికి చెందిన వాళ్లే ఉండటం విశేషం. ఇక రియాల్టీ రంగానికి చెందిన బిలియనీర్లు మిగిలిన స్థానాల్లో ఉన్నారు. దివీస్ ల్యాబొరేటరీ వ్యవస్థాపకుడు మురళి దివి, ఆయన ఫ్యామిలీ తెలుగు రాష్ట్రాల బిలియనీర్ల లిస్టులో టాప్ పొజిషన్‌లో ఉన్నారు. ఇక ఈ ఏడాది రాంకీ గ్రూప్‌కు చెందిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి బిలియనీర్ల లిస్టులోకి వచ్చారు.
ముంబైలో 66 మంది బిలియనీర్లు ఉన్నారు. గ్లోబల్ బిలియనీర్ల లిస్టులో ముంబైకి కూడా చోటు దక్కింది. ఇక న్యూ ఢిల్లీలో 39 మంది, బెంగళూరులో 21 మంది, హైదరాబాద్‌లో 12 మంది బిలియనీర్లు ఉన్నారు. ప్రపంచంలో అత్యధిక మంది బిలియనీర్లు అమెరికాలో ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో చైనా, ఇండియా ఉన్నాయి. ఈ ఏడాది 28 మంది బిలియనీర్ల లిస్టులో చోటు కోల్పోయారు. అమెరికాలోని మాంధ్యమే దీనికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
తెలుగు బిలియనీర్ల లిస్టు…
1. మురళి దివి అండ్ ఫ్యామిలీ – దివి ల్యాబ్స్ – 5.2 బిలియన్ డాలర్లు
2. బి. పార్థసారధి రెడ్డి అండ్ ఫ్యామిలీ – హెటెరో డ్రగ్స్ – 4.5 బిలియన్ డాలర్లు
3. పి. పిచ్చిరెడ్డి – మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ – 3.8 బిలియన్ డాలర్లు
4. పీవీ. కృష్ణారెడ్డి – మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ – 3.7 బిలియన్ డాలర్లు
5. ఎం. సత్యనారాయణరెడ్డి అండ్ ఫ్యామిలీ – ఎంఎస్ఎన్ ల్యాబ్స్ – 2 బిలియన్ డాలర్లు
6. జి. అమర్‌నాథ్ రెడ్డి అండ్ ఫ్యామిలీ – జీఏఆర్ – 1.8 బిలియన్ డాలర్లు
7. కే. సతీశ్ రెడ్డి అండ్ ఫ్యామిలీ – డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ – 1.5 బిలియన్ డాలర్లు
8. పీవీ. రాంప్రసాద్ రెడ్డి అండ్ ఫ్యామిలీ – డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ – 1.5 బిలియన్ డాలర్లు
9. జూపల్లి రామేశ్వరరావు అండ్ ఫ్యామిలీ – మైహోమ్ ఇండస్ట్రీస్ – 1.4 బిలియన్ డాలర్లు
10. జీవీ ప్రసాద్, అనురాధా ప్రసాద్ – డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ – 1.1 బిలియన్ డాలర్లు
11. జాస్తి వెంకటేశ్వర్లు అండ్ ఫ్యామిలీ – సువెన్ ఫార్మా – 1.1 బిలియన్ డాలర్లు
12. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి – రాంకీ గ్రూప్ – 1 బిలియన్ డాలర్లు
Huran,M3M List,Billionaires,Hyderabad,Telangana,Divis Murali,Megha Krishna Reddy,Real Estate In Hyderabad
Huran, M3M List, Billionaires, Hyderabad, Telangana, Divis Murali, Megha Krishna Reddy, Real Estate In Hyderabad
https://www.teluguglobal.com//business/hyderabad-is-the-center-of-billionaires-most-of-them-are-from-pharma-and-realty-sectors-896116