బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఘనంగా సంక్రాంతి సంబురాలు

2025-01-14 09:13:28.0

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య సంక్రాంతి సంబురాలను ఘనంగా నిర్వహించారు.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌లోతన నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య సంక్రాంతి సంబురాలను ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగ సంప్రదాయం ఉట్టిపడేలా ఉత్సవాలు నిర్వహించారు. స్వయంగా ఎమ్మెల్సీ కవిత స్వయంగా ముగ్గులు వేసి సంక్రాంతి వేడుకల్లో పాలుపంచుకున్నారు. తెలంగాణ ప్రజలు, రైతాంగం.. పాడిపంటలు, సిరి సంపదలు, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. కవిత ప్రజలందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

 

 

MLC Kavitha,Sankranthi celebrations,Hyderabad,Telangana People,BRS Party,KCR,KTR,Telangana Jagruthi