బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి జ‌నార్ధ‌న్ రెడ్డికి కేటీఆర్, హ‌రీశ్‌రావు ప‌రామ‌ర్శ‌

2024-12-24 09:22:48.0

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జ‌నార్ధ‌న్ రెడ్డిని పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ప‌రామ‌ర్శించారు.

 నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తండ్రి ఇటీవలి అనారోగ్యంతో మరణించిన నేపథ్యంలో వారి స్వగృహానికి వెళ్లి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ప‌రామ‌ర్శించారు. నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండ‌లం నేర‌ళ్ల‌ప‌ల్లి గ్రామంలో జ‌నార్ధ‌న్ రెడ్డి తండ్రి చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. మ‌ర్రి జ‌నార్ధ‌న్ రెడ్డితో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు బీఆర్ఎస్ నేత‌లు సానుభూతి ప్ర‌క‌టించారు.

Marri Janardhan Reddy,KTR,Harish Rao,Nagar Kurnool,Thimmajipet Mandal,Nerallapalli village,BRS Party,KCR