బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త ప్లాన్‌ ఇదే

2024-09-28 10:30:35.0

60 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ సౌకర్యం

ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ తన 4జీ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తున్నది. వినియోగదారులను ఆకర్షించడానికి కొత్త ప్లాన్‌లను పరిచయం చేస్తున్నది. తాజాగా తన ప్రీపెయిడ్‌ యూజర్ల కోసం సరికొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. 60 రోజుల వ్యాలిడిటీతో ఇటీవల బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ తీసుకొచ్చిన రూ. 345 ప్లాన్‌ 60 రోజుల వ్యాలిడిటీతో వస్తున్నది. రోజుకు 1జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ సౌకర్యం కల్పించింది. అయితే ఇందులో బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్యూన్స్‌, హార్డీ గేమ్స్‌ తరహా సదుపాయాలు ఉండవు. ప్రైవేట్‌ టెలికాం కంపెనీలన్నీ టారిఫ్‌లను పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలామంది యూజర్లను ఆకట్టుకోవడానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే సరికొత్త ప్లాన్‌లను ప్రవేవపెడుతున్నది. 

BSNL Plan 345,New Prepaid Plan,Offers,60 Days Validity