2025-01-15 13:55:55.0
శాంతిభద్రతల సమస్య వస్తే తక్షణం జోక్యం చేసుకుని పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారన్న సీఎం
ఆర్‌ఎస్‌ఎస్ అడుగుజాడల్లోనే నడుస్తూ బీఆర్‌ఎస్ పార్టీ బీఆర్‌ఎస్‌ఎస్‌గా మారిందని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో కాంగ్రెస్ నూతన కేంద్ర కార్యాలయంలో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన 40 ఏళ్లుగా సొంత కార్యాలయం లేకుండానే కాంగ్రెస్ పార్టీ దేశానికి సేవలందించిందని తెలిపారు. ప్రపంచంలోనే మేటి దేశంగా భారత్‌ను తయారు చేయడానికి, భవిష్యత్తు ప్రణాళికలు తయారు చేసే వేదికగా కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ఉంటుందని రేవంత్‌రెడ్డి వివరించారు. బీఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయని విలేకర్లు ప్రస్తావించగా.. ఎవరిపైనా దాడి జరిగితే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని సీఎం తెలిపారు. దేశంలో కాంగ్రెస్‌పై బీజేపీ చేసిన ఆరోపణలే రాష్ట్రంలో బీఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నదని విమర్శించారు. మీరు ఎక్కడికైనా వెళ్లి చూడండి. శాంతిభద్రతల సమస్య వస్తే తక్షణం జోక్యం చేసుకుని పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారని, గత ప్రభుత్వం ఆ పనిచేయాల్సి ఉండాల్సిందని ఈ సందర్భంగా మీడియాతో అన్నారు.
CM Revanth Reddy,Attend,AICC HQ inauguration,BRS BRSS In Delhi,Law and order issue