బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుంది : ఎమ్మెల్సీ కవిత

2025-02-15 11:28:28.0

ఖమ్మం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖమ్మంలో బీసీ కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత పాల్గోన్నారు

బీసీల రిజర్వేషన్ల పేరుతో పెద్ద కుట్ర జరుగుతుందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఖమ్మంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీ కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గోన్నారు. 46 శాతం ఉన్న బీసీలకు అదే స్థాయిలో విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు ఇవ్వాలన్న కవిత.. బీసీల విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక బిల్లులు పెట్టాలని డిమాండ్‌ చేశారు. మూడు బిల్లులు పెట్టకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనట్టేని ఆమె అన్నారు. మీకు నిజాయితీ ఉంటే సిన్సియర్‌గా రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే మూడు బిల్లులు పెట్టండి.

సీఎం రేవంత్ రెడ్డి తనకు అవసరమైనప్పుడు బీజేపీ నేతలతో మాట్లాడిస్తుంటాడని ఆమె అన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌పై కోపంతో రైతులను బాధపెడుతున్నారని పేర్కొన్నారు. బీసి రిజర్వేషన్ల సర్వే పూర్తి చేసి ఫిగర్స్ స్పష్టం చేయాలని.. బీసీ రిజర్వేషన్ల పేరుతో పెద్ద కుట్ర జరుగుతోందన్నారు. ఖమ్మం జిల్లాకి ముగ్గురు మంత్రులు ఉన్నారు. నిజామాబాద్‌లో మంత్రే లేడు. కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టాం. కేసీఆర్‌పై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని కవిత పేర్కొన్నారు.

MLC Kavitha,Congress party,BC reservations,Nizamabad,CM Revanth Reddy,KCR,KTR,BRS Party,BJP,Khammam,Telangana jaagriti,Kaleshwaram project