https://www.teluguglobal.com/h-upload/2024/11/23/1380207-india-vs-aus.webp
2024-11-23 04:48:08.0
46 రన్స్ ఆధిక్యంలో టీమిండియా
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 104 రన్స్‌కు ఆలౌట్ అయ్యింది. 46 రన్స్ వెనుకబడి ఉన్నది. అంతకుముందు 67/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో బరిలోకి దిగిన కంగారు జట్టు రెండో రోజు ఆట ప్రారంభించిన కొద్ది సేపటికే ఆసీస్‌కు షాక్ తగిలింది. స్టార్క్ (26) ఒక్కడే రాణించాడు. టీమిండియా బౌలర్లలో కెప్టెన్ బూమ్రా 5, సిరాజ్ 2, హర్షిత్ రానా 3 వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 150 రన్స్‌కు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఉస్మాన్ ఖవాజా 8, మెక్‌స్వీని 10, లబుషేన్ 2, స్టివ్ స్మిత్ డకౌట్, ట్రావిస్ హెడ్ 11, మిచెల్ మార్ష్ 6, అలెక్స్ కేరీ 21, కమిన్స్ 3, నాథన్ లైయన్ 5 రన్స్ చేశారు.