2016-04-04 07:12:15.0
కర్ణాటకలో మొట్టమొదటి మహిళా టెక్ పార్కుని ఏర్పాటు చేయనున్నారు. బెంగలూరుకి 40 కిలోమీటర్ల దూరంలో కనకపురా తాలూకాలోని హరోహళ్లిలో 300 ఎకరాల స్థలంలో దీన్ని స్థాపించనున్నారు. దీని నిర్మాణ నిర్వహణ నుండి అన్ని పనులకు సంబంధించిన అవకాశాలను మహిళలకే ఇస్తారు. మహిళా టెక్‌పార్కుకి ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభత్వం సాధారణ మౌలిక వసతుల ఏర్పాటుకి గ్రాంట్లు మంజూరు చేసింది. దీన్ని ప్రత్యేకంగా మహిళా టెక్ పార్కుగా రూపుదిద్దనున్నారు. ఇప్పటికే 56మంది ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలనుండి దరఖాస్తులు వచ్చాయని […]
http://www.teluguglobal.com/wp-content/uploads/2016/04/women-tech-park.gif
కర్ణాటకలో మొట్టమొదటి మహిళా టెక్ పార్కుని ఏర్పాటు చేయనున్నారు. బెంగలూరుకి 40 కిలోమీటర్ల దూరంలో కనకపురా తాలూకాలోని హరోహళ్లిలో 300 ఎకరాల స్థలంలో దీన్ని స్థాపించనున్నారు. దీని నిర్మాణ నిర్వహణ నుండి అన్ని పనులకు సంబంధించిన అవకాశాలను మహిళలకే ఇస్తారు. మహిళా టెక్‌పార్కుకి ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభత్వం సాధారణ మౌలిక వసతుల ఏర్పాటుకి గ్రాంట్లు మంజూరు చేసింది.
దీన్ని ప్రత్యేకంగా మహిళా టెక్ పార్కుగా రూపుదిద్దనున్నారు. ఇప్పటికే 56మంది ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలనుండి దరఖాస్తులు వచ్చాయని రాష్ట్ర వాణిజ్య పరిశ్రమల శాఖ తెలిపింది. ఐటి…ఔట్ సోర్సింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్‌టైల్స్, టెలికామ్, ఎలక్ట్రానిక్స్ తదితర వ్యాపార కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. 2,800 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.
Harohalli