2024-10-23 07:06:37.0
బీసీసీఐకి బైజూస్ చెల్లించాల్సిన 158.9 కోట్ల పెండింగ్ బిల్లుల నిర్ణయాన్ని కొట్టివేసిన అత్యున్నత న్యాయస్థానం
https://www.teluguglobal.com/h-upload/2024/10/23/1371666-byjus.webp
బైజూస్‌తో వివాదంపై బీసీసీఐకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ దివాళ ప్రక్రియకు నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఇచ్చిన అనుమతిని సుప్రీంకోర్టు నిలిపివేసింది. బీసీసీఐకి బైజూస్ చెల్లించాల్సిన 158.9 కోట్ల పెండింగ్ బిల్లుల నిర్ణయాన్ని కొట్టివేసింది. బీసీసీఐనే 158.9 కోట్లను కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. బైజూస్ ఓ దశలో వెలుగు వెలిగినప్పుడు బీసీసీఐ స్పాన్సర్‌గా వ్యవహరించిన విషయం విదితమే. 2023 నవంబర్ వరకు జెర్సీ స్పాన్సర్‌గా బైజూస్ వ్యవహరించాల్సి ఉండగా..అర్ధంతరంగా అది వైదొలిగింది. ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ ముగిసినా రూ. 158.9 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంపై గత ఏడాది నవంబర్‌లో బైజూస్ పై ఎన్‌సీఎల్‌ఏటీ కేసు నమోదైంది.
ఎన్‌సీఎల్‌ఎటి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ యుఎస్‌కు చెందిన గ్లాస్ ట్రస్ట్ కంపెనీ ఎల్‌ఎల్‌సీ అప్పీల్ పై సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి తీర్పును సెప్టెంబర్ 26 వరకు రిజర్వ్ చేసింది.
Supreme Court,NCLAT to close the insolvency proceedings,against ed-tech company Byju’s,BCCI