బొకేలకు బదులుగా పుస్తకాలు గిఫ్ట్‌ ఇవ్వండి

2024-12-28 11:15:23.0

https://www.teluguglobal.com/h-upload/2024/12/28/1389785-jishnu-dev-varma.webp

రాష్ట్ర ప్రజలకు గవర్నర్ జిష్ణుదేవ్‌ వర్మ పిలుపు

ఫంక్షన్లు, శుభాకార్యాలు, ఇతర అకేషన్లలో గిఫ్టులుగా బొకేలకు బదులుగా పుస్తకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ ను ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నమిలి మింగేయాలన్నంత క్షుణ్నంగా పుస్తకాలను చదవాలని సూచించారు. చదువు రాదనే చింత కూడా అవసరం లేదని.. అలాంటి వారి కోసం ఆడియో బుక్స్‌ కూడా అందుబాటులోకి వచ్చాయన్నారు. పుస్తకాలను చదవడం ద్వారా జ్ఞానం పెంపొందుతుందని తెలిపారు. ఎలక్ట్రానిక్‌ బుక్స్‌ చదవడం కన్నా పుస్తకాలను నేరుగా చదివితేనే ఎక్కువ సంతృప్తి కలుగుతుందన్నారు. యువత పుస్తకాలు ఎక్కువగా చదివేలా ప్రోత్సహించాలని సూచించారు.

Hyderabad Book Fair,Governor,Jishnudev Verma,Flower Bouquets,Books