బోటు ప్రమాదంపై బీసీ కమిషన్ నివేదికకు ఆదేశం

2025-01-29 14:34:39.0

హుస్సేన్ సాగర్ బోటు ప్రమాద ఘటనపై తెలంగాణ బీసీ కమిషన్ సీరియస్ అయ్యింది

హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌లో బోటు ప్రమాదంపై తెలంగాణ బీసీ కమిషన్ స్పందించింది. ఘటనపై మూడురోజుల్లోగా నివేదిక ఇవ్వాలని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌‌ని కోరింది. ఫిబ్రవరి 1న సాయంత్రంలోగా నివేదికగా అందించాలని బీసీ కమిషన్ చైర్మన్ ఆదేశించారు.

ఈనెల 26న భరతమాతకు హరతి కార్యక్రమంలో హుస్సేస్ సాగర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో బొట్లు తగలబడి ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

Hussain Sagar boat accident,Telangana BC Commission,BC Commission Chairman Niranjan,Hyderabad CP CV Anand,Report,Bharat Mata Harathi program,CM Revanth reddy,Telangana goverment