2025-03-08 06:43:12.0
ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలు.. ఆస్పత్రికి తరలింపు
హైదరాబాద్ బోరబండ పరిధిలోని సంజయ్‌నగర్‌లో గ్యాస్ సిలిండర్ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 5గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. బాధితులు స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. పేలుడు ధాటికి సమీపంలోని ఇండ్లు కూడా దెబ్బతిన్నాయి. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టగా.. ప్రమాదానికి గల కారణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Gas cylinder blast,Borabanda,Five people seriously injured,Nearby houses damaged