2022-07-07 04:20:51.0
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ గురువారం నాడు తన పదవికి రాజీనామా చేశారు. నిన్నటి నుండి వరసగా ఆయన ప్రభుత్వంలోని మంత్రులు రాజీనామాలు చేస్తుండటంతో అక్కడ రాజకీయ సంక్షోభం నెలకొంది. దాంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో బోరిస్ రాజీనామా చేయాల్సి వచ్చింది. లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణల వివాదంలో చిక్కుకున్న ఎంపీ క్రిస్ పించర్‌ను ప్రధాని జాన్సన్ తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. ఆయన నిర్ణయాన్ని మొత్తం మంత్రివర్గం వ్యతిరేకించింది. అయినప్పటికీ బోరిస్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. దాంతో […]
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ గురువారం నాడు తన పదవికి రాజీనామా చేశారు. నిన్నటి నుండి వరసగా ఆయన ప్రభుత్వంలోని మంత్రులు రాజీనామాలు చేస్తుండటంతో అక్కడ రాజకీయ సంక్షోభం నెలకొంది. దాంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో బోరిస్ రాజీనామా చేయాల్సి వచ్చింది.
లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణల వివాదంలో చిక్కుకున్న ఎంపీ క్రిస్ పించర్‌ను ప్రధాని జాన్సన్ తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. ఆయన నిర్ణయాన్ని మొత్తం మంత్రివర్గం వ్యతిరేకించింది. అయినప్పటికీ బోరిస్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. దాంతో తీవ్ర అసంత్రుప్తికి లోనైన మంత్రులు వరసగా రాజీనామాలు చేశారు.
ఆర్థిక మంత్రి రిషి సునక్, ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్ లు మంగళవారం రాజీనామా చేసినప్పటి నుండి బోరిస్ జాన్సన్ క్యాబినెట్‌లోని 50 మందికి పైగా సీనియర్, జూనియర్ సభ్యులు, ఉన్నత స్థాయి అధికారులు రాజీనామాలు చేశారు.
దీంతో ఒంటరి అయిపోయిన బోరిస్ జాన్సన్ కు రాజీనామా చేయడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది.
కన్జర్వేటివ్ పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకునే దాకా జాన్సన్ ఆపద్దర్మ ప్రధానమంత్రిగా ఉంటారని భావిస్తున్నారు. త్వరలోనే కన్జర్వేటివ్ పార్టీ అంతర్గత ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అక్టోబర్ నాటికి కొత్త నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉందని BBC తెలిపింది.
boris johnson,London,resign