బ్రెస్ట్‌ క్యాన్సర్‌ పై అవగాహన కోసం రేపు పింక్‌ పవర్‌ రన్‌

2024-09-28 15:02:47.0

ఎంఈఐఎల్‌, సుధా రెడ్డి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహన

https://www.teluguglobal.com/h-upload/2024/09/28/1364146-pink-marathon.webp

మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ పై అవగాహన కల్పించేందుకు ఆదివారం నగరంలో పింక్‌ పవర్‌ రన్‌ – 2024 నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ సహకారం, మేఘా ఇంజనీరింగ్‌ ఇన్‌ ఫ్రాస్ట్రక్షర్‌ లిమిటెడ్‌, సుధారెడ్డి ఫౌండేషన్‌ ఈ రన్‌ నిర్వహిస్తోందని సుధారెడ్డి వెల్లడించారు. మూడు, ఐదు, పది కి.మీ.ల రన్‌ నిర్వహిస్తామని గచ్చిబౌలి స్టేడియంలో ఈ రన్‌ ప్రారంభమై ఓల్డ్‌ ముంబయి నేషనల్‌ హైవే, ఐఎస్‌బీ రోడ్‌, టీఎన్‌వో కాలనీ మీదుగా తిరిగి గచ్చిబౌలి స్టేడియానికి చేరుకుంటుందని తెలిపారు. పింక్‌ మారథాన్‌ లో పాల్గొనే వారికి న్యూట్రిషన్‌ కిట్లు అందజేస్తారు. రన్‌ పూర్తి చేసిన వారికి మెడల్స్‌ అందజేస్తారు. రన్‌ లో పాల్గొనేందుకు ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్న వాళ్లు పింక్‌ కలర్‌ డ్రెసెస్‌ లో పక్షి రూపంలో భారీ మానవహారంగా ఏర్పడి గిన్నీస్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేసేందుకు ప్రయత్నించనున్నారు.

Pink Power Run,Breast Cancer Awareness,MEIL,Sudha Reddy