2025-01-03 09:44:06.0
డిప్యూటీ సీఎం భట్టి పర్యటనలో జగ్గారెడ్డి పాల్గొనకపోవడంపై కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ మొదలైంది
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంగారెడ్డి పర్యటనలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కనిపించకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. సంగారెడ్డి జిల్లాలో ఏ అధికారిక కార్యక్రమం జరిగిన ముందుండే జగ్గారెడ్డి శుక్రవారం జరిగిన మీటింగ్‌కు హాజరు కాకపోవడంపై ఆ పార్టీ వర్గాల్లో హాట్ టాపీక్‌గా మారింది. హైదరాబాద్ ఐఐటీలో ఖనిజ ఉత్పత్తుల కోసం ఐఐటీ హైదరాబాద్‌తో సింగరేణి ఒప్పందం చేసుకున్న కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి హాజరయ్యారు. అయితే ఈ సమావేశన్నికి జగ్గారెడ్డి మాత్రం డుమ్మా కొట్టాడు. దీంతో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపుతుంది .
కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు ముమ్మరమయ్యాయని, సీఎం పదవి కోసం భట్టితో పాటు మరికొందరు సీనియర్ నాయకులు అంతర్గతంగా కొద్ది రోజుల నుంచి పావులు కదుపుతున్నారని కాంగ్రెస్ నేతలే బాహాటంగా చర్చించుకుంటున్నారు.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన జగ్గారెడ్డి అందుకే సదరు కార్యక్రమానికి హాజరు కాలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. తనకు రెండో పవర్ సెంటర్‌గా ఎవరు ఉండొద్దనే కోణంలో సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే జగ్గారెడ్డిని అటెండ్ కాకుండా అడ్డుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
Deputy CM Bhatti Vikramarka,Jaggareddy,Sangareddy tour,Singareni Agreement,CM Revanth Reddy,Hyderabad,Congress party,Rahul gandhi,IIT Hyderabad,Sangareddy,Telangana News