https://www.teluguglobal.com/h-upload/2022/11/06/500x300_424367-beauty-parlour-stroke-syndr.webp
2022-11-06 08:21:47.0
Beauty Parlour Stroke Syndrome: హైదరాబాద్‌లోని ఒక సెలూన్‌లో హెయిర్ వాష్ చేయడం వల్ల 50 ఏళ్ల మహిళకు స్ట్రోక్ వచ్చింది. డాక్టర్లు దీన్ని ‘బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్’ అంటున్నారు. బ్యూటీ పార్లర్స్‌కు వెళ్లేవాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. అసలేంటీ సిండ్రోమ్? ఇదెలా వస్తుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్‌లోని ఒక సెలూన్‌లో హెయిర్ వాష్ చేయడం వల్ల 50 ఏళ్ల మహిళకు స్ట్రోక్ వచ్చింది. డాక్టర్లు దీన్ని ‘బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్’ అంటున్నారు. బ్యూటీ పార్లర్స్‌కు వెళ్లేవాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. అసలేంటీ సిండ్రోమ్? ఇదెలా వస్తుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్‌లో సెలూన్‌కు వెళ్లిన యాభై ఏళ్ల మహిళకు హెడ్ వాష్ చేస్తుండగా ఉన్నట్టుండి అలసట, మైకంగా అనిపించింది. ఏం జరుగుతుందో అర్థం అయ్యేలోపు ఆమెకు స్ట్రోక్ వచ్చింది. ఆమెకు హెడ్ మసాజ్ చేసేటప్పుడు మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే కీలక నాళం ప్రెస్ అవ్వడం వల్ల స్ట్రోక్ వచ్చిందని డాక్టర్లు కనుగొన్నారు. దీన్నే ‘బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్’గా పిలుస్తున్నారు. అయితే ఆ మహిళకు వెన్నుపూస దగ్గర ఉండే ధమని చాలా సన్నగా ఉండడంతో ప్రమాదం జరిగిందని డాక్టర్లు చెప్తున్నారు. అందుకే నరాలకు సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్లు మసాజ్ లు చేయించుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
పార్లర్‌లో హెడ్ మసాజ్ చేసేటప్పుడు తలను వెనక్కు తిప్పడం, మెడ వెనుక భాగాల్లో గట్టిగా ప్రెస్ చేయడం లాంటివి చేస్తుంటారు. మెదడుకు వెళ్లే ఎన్నో కీలకమైన నరాలు ఉండే చోట సరైన అవగాహన లేకుండా మసాజ్ చేయడం వల్ల కొంతమందికి సమస్యగా మారొచ్చు. నరాల బలహీనత, తలనొప్పి, మైగ్రేన్, న్యూరో ప్లాబ్లమ్స్ ఉన్నవాళ్లు ఇలాంటి మసాజ్‌లకు దూరంగా ఉండడం మంచిది.
ఇలాంటి స్ట్రోక్స్ వచ్చేముందు మైకం, వికారం, వాంతులు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అలా అనిపించినప్పుడు వెంటనే దీర్ఘమైన శ్వాసలు తీసుకోవాలి. నీళ్లు తాగి రిలాక్స్ అవ్వాలి. అలాగే సెలూన్‌లో హెయిర్ వాష్ చేసేటప్పుడు మెడకు సపోర్ట్ ఉండేలా చూసుకోవాలి. మసాజ్ లాంటివి చేయించుకునేటప్పుడు ట్రైన్డ్ థెరపిస్టులను ఎంచుకోవాలి.
Beauty,Treatment,Brain,Haircare,Stroke,Beauty Parlour Stroke Syndrome
Beauty Parlour Stroke Syndrome, what is Beauty Parlour Stroke Syndrome, is Beauty Parlour Stroke Syndrome fatal, Beauty Parlour Stroke Syndrome symptoms, Beauty Parlour Stroke Syndrome treatment, woman Beauty Parlour Stroke Syndrome Hyderabad, Beauty Parlour Stroke Syndrome news, neck hypertension, Beauty Parlour Stroke Syndrome in Hyderabad, బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్
https://www.teluguglobal.com//health-life-style/woman-shows-symptoms-of-beauty-parlour-stroke-syndrome-after-a-hair-wash-at-salon-know-more-356082