భరతభూమి పుణ్యభాగ్య మిదియె

2023-08-18 12:04:34.0

https://www.teluguglobal.com/h-upload/2023/08/18/812129-bharat.webp

(ఆటవెలది )

భావి హితము గోరి భవ్య సంస్కృతి నిచ్చె

ధర్మ మార్గ మెంచి దారి జూపి

సకల శాస్త్ర నీతి సంపద లందించె

భరత భూమి పుణ్య భాగ్య మిదియె

సృష్టి ధర్మ మెంచి శాస్త్రధర్మము తోడ

జాగృతమ్ము జేసె జాతి నంత

భారతీయ ఘనత భాసిల్లె మెండుగ

భరత భూమి పుణ్య భాగ్య మిదియె

సప్త వర్ణ మంత సరిసింగిడై నట్లు

భిన్నములకు భావ భేద మడచి

బంధ మేసి భావి భవితకై కలగనె

భరత భూమి పుణ్య భాగ్య మిదియె

మాన్య జనుల నుండి మహిత వాక్కుల గని

త్యాగ ధనుల ఘన పథమ్ము నడిచి

దేశ చరిత యెల్ల దేదీప్య మయ్యెను

భరత భూమి పుణ్య భాగ్య మిదియె

-గుగ్గిళ్ళ నాగభూషణా చారి

( జగిత్యాల )

Telugu Kavithalu,Guggilla Nagabhushana Chary