http://www.teluguglobal.com/wp-content/uploads/2016/03/delivery.gif
2016-03-08 06:34:43.0
ముప్పయ్యేళ్ల క్రితం భారతదేశపు మొట్టమొదటి టెస్ట్‌ట్యూబ్ బెబీగా సంచలనం సృష్టించిన హర్షా చావ్‌దా ఇప్పుడు ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఐవిఎఫ్ విధానంతో హర్ష జననానికి వైద్య సారధిగా నిలిచిన డాక్టర్ ఇందిరా హిందుజ ఇప్పుడు హర్షకు డెలివరీ చేయడం విశేషం. హర్ష, దివ్యపాల్ షా అనే ముంబయికి చెందిన ఎకౌటెంట్‌ని వివాహం చేసుకుంది. భారతదేశపు తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీ అయిన హర్ష సాధారణ రీతిలోనే గర్భం దాల్చి 3.18కిలోల బరువున్న బిడ్డకు జన్మనిచ్చింది. హర్షతో తమ […]
ముప్పయ్యేళ్ల క్రితం భారతదేశపు మొట్టమొదటి టెస్ట్‌ట్యూబ్ బెబీగా సంచలనం సృష్టించిన హర్షా చావ్‌దా ఇప్పుడు ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఐవిఎఫ్ విధానంతో హర్ష జననానికి వైద్య సారధిగా నిలిచిన డాక్టర్ ఇందిరా హిందుజ ఇప్పుడు హర్షకు డెలివరీ చేయడం విశేషం. హర్ష, దివ్యపాల్ షా అనే ముంబయికి చెందిన ఎకౌటెంట్‌ని వివాహం చేసుకుంది. భారతదేశపు తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీ అయిన హర్ష సాధారణ రీతిలోనే గర్భం దాల్చి 3.18కిలోల బరువున్న బిడ్డకు జన్మనిచ్చింది. హర్షతో తమ అనుబంధం ఆమె పుట్టుకనుండీ కొనసాగిందని, ఆమె తమతో మాట్లాడుతూ ఉంటుందని, అందుకే హర్ష తన డెలివరీ కూడా మేమే చేయాలని ఆశించిందని నాడు హర్ష జననం తాలూకూ వైద్య ప్రక్రియలో పాలుపంచుకున్న డాక్టర్ కుసుమ్ జవేరి అన్నారు.
హర్ష జన్మించిన ఆగస్టు 6, 1986వ తేదీని డాక్టర్ హిందుజా ఈ సందర్భంలో మళ్లీ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఈ విధానం పాశ్చాత్య దేశాల్లో ప్రాచుర్యంలో ఉన్నా భారత్‌లో మాత్రం అదే మొదలు కావడంతో నాడు వైద్యులు, హర్ష తల్లిదండ్రులు పొందిన ఆనందానికి హద్దులు లేవు. హర్ష తరువాత డాక్టర్ హిందుజా 15వేల మంది టెస్ట్‌ట్యూబ్ బేబీలకు ప్రాణం పోశారు. హర్ష జననానికి తాము ఎన్నో సంస్థల నుండి అనుమతులు తీసుకున్నామని డాక్టర్ హిందుజా గుర్తు చేసుకున్నారు.
https://www.teluguglobal.com//2016/03/08/భాతరదేశపు-మొట్టమొద/