భారతమ్మ ముద్దుబిడ్డ

2023-03-15 07:27:23.0

https://www.teluguglobal.com/h-upload/2023/03/15/726882-bjarat.webp

ఇంటికి భారమై

యుక్త వయస్సు

తులాభారం తూగుతూ

కట్నం సమభాగం తూగక

పెళ్ళి యజ్ఞం లో ఆజ్యాన్ని

భారతమ్మ బిడ్డను!

అందరి కంచాలు నింపి

అన్ని కంచాలు కడిగి

నాలుగడుగుల చాపపై

మూడంకె వేసి

సుప్రభాతం పాడి

సూర్యుణ్ణి నిద్రలేపే

భారతమ్మ సగటు బిడ్డను!

నారీ శక్తికి చిరునామానై

స్త్రీ జాతి గర్వించేలా

పురుష జాతి నివ్వెరపడేలా

వ్యోమయానం చేసిన

కల్పనా చావ్లాను.

భారతమ్మ ముద్దుబిడ్డను!

– అడిగోపుల వెంకటరత్నం

Bharatamma Muddubidda,Adigopula Venkataratnam,Telugu Kavithalu