2022-07-01 06:24:22.0
భారతదేశంలో సామూహిక హత్యలు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉందని అమెరికా సంయుక్త రాష్ట్రాల సీనియర్ అధికారి ఒకరు గురువారం ఆందోళన వెలిబుచ్చారని హిందుస్తాన్ టైమ్స్ నివేదించింది. భారతదేశంలో మత స్వేచ్ఛపై జరిగిన చర్చా కార్యక్రమంలో అంతర్జాతీయ మత స్వేచ్ఛ రాయబారి ఈ వ్యాఖ్యలు చేశారు. సామూహిక హత్యలకు గురయ్యే దేశాలలో భారతదేశం రెండవ స్థానంలో ఉందని జర్మనీ హోలోకాస్ట్ మ్యూజియంలోని ఎర్లీ వార్నింగ్ ప్రాజెక్ట్ పరిశోధన తెలియజేసిందని ఆయన అన్నారు. 2022లో భారతదేశంలో సామూహిక హత్యలు ప్రారంభమయ్యే […]
భారతదేశంలో సామూహిక హత్యలు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉందని అమెరికా సంయుక్త రాష్ట్రాల సీనియర్ అధికారి ఒకరు గురువారం ఆందోళన వెలిబుచ్చారని హిందుస్తాన్ టైమ్స్ నివేదించింది.
భారతదేశంలో మత స్వేచ్ఛపై జరిగిన చర్చా కార్యక్రమంలో అంతర్జాతీయ మత స్వేచ్ఛ రాయబారి ఈ వ్యాఖ్యలు చేశారు. సామూహిక హత్యలకు గురయ్యే దేశాలలో భారతదేశం రెండవ స్థానంలో ఉందని జర్మనీ హోలోకాస్ట్ మ్యూజియంలోని ఎర్లీ వార్నింగ్ ప్రాజెక్ట్ పరిశోధన తెలియజేసిందని ఆయన అన్నారు.
2022లో భారతదేశంలో సామూహిక హత్యలు ప్రారంభమయ్యే అవకాశం 14.4% ఉందని ఆ ప్రాజెక్ట్ పేర్కొంది. పాకిస్తాన్ లో సామూహిక హత్యలు జరిగే అవకాశం 15.2% ఉందని చెప్పిన ఆ ప్రాజెక్ట్ సామూహిక హత్యల అత్యధిక ప్రమాదం ఉన్న మొదటి దేశంగా దేశంగా పాకిస్తాన్, రెండవ దేశంగా భారత్ ను పేర్కొందని ఆయన తెలిపారు.
భారతదేశంలో మతపరమైన మైనారిటీల హక్కులను హరించే సంఘటనలు చాలా జరుగుతున్నాయని, ఈ విషయంపై నేరుగా న్యూఢిల్లీతో వాషింగ్టన్ తన ఆందోళన తెలియజేసిందని ఆయన చెప్పారు.
చర్చిలపై దాడులు చేసారు, ఇళ్లను కూల్చివేసారు, హిజాబ్‌పై నిషేధం విధించారు, అంతేకాక ఓ మంత్రి ముస్లింలను చెదపురుగులుగా వర్ణించారని ఆయన అన్నారు.
సెప్టెంబరు 2018లో, భారతీయ జనతా పార్టీ నాయకుడు అమిత్ షా బంగ్లాదేశ్ వలసదారులను “చెదపురుగులు” అని అభివర్ణించారు, వారు త్వరలో భారతదేశంలోని ఓటర్ల జాబితా నుండి తొలగించబడతారని అన్నారు. ప్రస్తుతం కేంద్ర హోంమంత్రిగా ఉన్న షా అప్పుడు బీజేపీ చీఫ్‌గా ఉన్నారు.
భారతదేశంలో మైనారిటీలపై దాడులు, హత్యలు, దాడులు, బెదిరింపులు గత ఏడాది పొడవునా జరిగాయని యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడం 2021 నివేదిక పేర్కొంది.
భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో గోరక్షణ పేరుతో దాడులు, మతపరమైన స్థలాలపై, ముస్లింలకు చెందిన ఆస్తులపై దాడులు, మతమార్పిడి నిరోధక చట్టాలతో సహా మైనారిటీలపై హింసాత్మక సంఘటనలతో కూడిన జాబితాను ఆ నివేదిక రూపొందించింది.
ఇదిలావుండగా, ఈ సంవత్సరం మే వరకు భారతదేశంలో క్రైస్తవులపై 207 హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయని ఎన్ జీఓ యునైటెడ్ క్రిస్టియన్ ఫోరమ్ తెలిపింది.
2021లో క్రైస్తవులపై 505 హింసాత్మక ఘటనలు జరిగాయని.. వీటిలో 100కి పైగా ఘటనలు ఉత్తరప్రదేశ్‌లోనే నమోదయ్యాయని ఆ సంస్థ తెలిపింది.
ఈ ఏడాది మే వరకు, ఉత్తరప్రదేశ్ లో క్రైస్తవులపై 48 హింసాత్మక సంఘటనలు జరిగాయని, ఛత్తీస్‌గఢ్ లో44 సంఘటనలు జరిగాయని యునైటెడ్ క్రిస్టియన్ ఫోరమ్ పేర్కొంది.
Ambassador-at-Large for International Religious Freedom,america,high risk,India,mass killings,Pakistan,Rashad Hussain,senior US official,US