2024-12-01 12:25:16.0
లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా కీలక ట్వీట్ చేశారు. భారత్ జీడీపీ రెండు సంవత్సరాలలో కనిష్టమైన 5.4% కు పడిపోయిందని రాసుకొచ్చారు
https://www.teluguglobal.com/h-upload/2024/12/01/1382522-rahul-gandhi.webp
భారత్ జీడీపీ రెండేళ్ల కనిష్ట స్థాయి 5.4% కు పడిపోయిందని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా తెలిపారు. దేశంలో కొంత మంది బిలియనీర్లు మాత్రమే లబ్దిపొందుతున్నంత కాలం ఆర్దిక వ్యవస్ధలో ఎటువంటి పురోగతి ఉండదని తెలిపారు. రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్పకాలిక ధరల పెరుగుదల 14 నెలల గరిష్ట స్థాయిగా 6.21% కు చేరుకుంది. గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ ఏడాది ఆలుగడ్డ, ఉల్లి ధరలు సుమారు 50% పెరిగాయి. రాహుల్ గాంధీ పేర్కొన్నారు. నిరుద్యోగం 45 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిందని, రూపాయి విలువ కనిష్ఠస్థాయి 84.50కి చేరిందని ట్వీట్ చేశారు.
భారతదేశం GDP వృద్ధి రేటు రెండు సంవత్సరాలలో కనిష్టమైన 5.4% కు పడిపోయిందని రాసుకొచ్చారు. “స్పష్టమైన విషయం ఏంటంటే – భారత ఆర్థికవ్యవస్థ అభివృద్ధి చెందడానికి, అది కేవలం కొద్ది మంది అంబానీలు మాత్రమే లాభపడుతుంటే, రైతులు, కార్మికులు, మధ్యతరగతి, పేదలు అనేక ఆర్థిక సమస్యలతో పోరాడుతున్నప్పుడు సాధ్యం కాదని రాహుల్ రాసుకొచ్చారు. దీంతో పాటుగా.. ఈ వాస్తవాలను ఒకసారి పరిశీలించండి, పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో చూడండి ఈ క్రింది అంశాలను రాహుల్ లేవనెత్తారు.
Rahul Gandhi,GDP,Economic system,Retail inflation,unemployment,PM Modi,NDA Goverment,minister nirmala sitharaman,Farmers,laborers