భారత్ టార్గెట్ 265 పరుగులు

2025-03-04 12:38:46.0

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా 264 పరుగులకు ఆలౌట్ అయింది

ఐసీసీ ఛాంపియన్స్ దుబాయ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. 50 ఓవర్లకు 264 పరుగులకు ఆసీస్ ఆలౌట్ అయింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ మ్యాచ్‌లో 96 బంతుల్లో అత‌ను 73 ర‌న్స్ చేసి నిష్క్ర‌మించాడు. అత‌ని ఇన్నింగ్స్‌లో నాలుగు బౌండ‌రీలు, ఓ సిక్స‌ర్ ఉన్నాయి. భార‌త పేస‌ర్ ష‌మీ బౌలింగ్‌లో అత‌ను క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అలెక్స్ కేరీ 61 రన్స్‌తో రాణించాడు. ట్రావిస్ హెడ్ 39, లుబుషేన్ 29 పరుగులు చేశాడు. భారత్ బౌలర్లలో షమీ 3 వికెట్లు వరుణ్, జాడేజా చెరో 2 వికెట్లు తీశారు. 

Australia,Dubai,india,opener Cooper,Steve Smith,Rohit Sharma,Champions Trophy 2025,Team India,Semifinal Dubai,Shami,Alex Carey