https://www.teluguglobal.com/h-upload/2023/06/21/500x300_785840-210606.webp
2023-06-21 04:32:03.0
పీసీఐని ఉపయోగించి తొలి సారి 194 దేశాల ఆర్థిక, ఉత్పాదక సామర్థ్యాన్ని అంచనా వేసింది.
భారతదేశ ఉత్పాదక సామర్థ్యం 45.25 పాయింట్లుగా ఉన్నట్లు ఐక్య రాజ్య సమితికి చెందిన యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ (UNCTAD) తెలిపింది. ఒక దేశ ఉత్పాదక సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి సాంప్రదాయంగా వినియోగిస్తున్న జీడీపీ (గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్) స్థానంలో కొత్త తరం ఉత్పాదక సామర్థ్య సూచి (పీసీఐ)ని ఇటీవలే ప్రవేశపెట్టింది. ఈ పీసీఐని ఉపయోగించి ఆయా దేశాలు తమ ఉత్పాదక సామర్థ్యాన్ని మరింత కచ్చితంగా తెలుసుకునే వీలుంటుందని ఐక్యరాజ్య సమితి తెలిపింది.
పీసీఐని ఉపయోగించి తొలి సారి 194 దేశాల ఆర్థిక, ఉత్పాదక సామర్థ్యాన్ని అంచనా వేసింది. దీనికి సంబంధించిన తాజా ఫలితాలను ఐక్యరాజ్య సమితి ప్రకటించగా.. అందులో భారత్ 100 పాయింట్లకు గాను 45.24 సాధించింది. మన పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ 40.71, పాకిస్తాన్ 33.81 పీసీఐ సాధించాయి. ఇక చైనా 60.65, రష్యా 51.31 పీసీఐ రేటింగ్ కలిగి ఉన్నాయి.
2022కు గాను విడుదల చేసిన పీసీఐలో డెన్మార్క్ 70.31 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నది. ఆ తర్వాత ఆస్ట్రేలియా 69.24, యూఎస్ఏ 69.24 ఉన్నాయి. కొత్తగా తీసుకొచ్చిన పీసీఐని 42 ఇండికేటర్ల సాయంతో అంచనా వేస్తారు. ఈ రేటింగ్ ఆధారంగా ఆయా దేశాల ఉత్పాదక సామర్థ్యాన్ని తెలుసుకుంటారు. ఏ దేశం ఎలాంటి వస్తు తయారీ, సేవల సామర్థ్యాన్ని కలిగి ఉన్నదో పీసీఐ స్పష్టంగా తెలియజేస్తుంది.
టాప్ 10 పీసీఐ దేశాలు
డెన్మార్క్ – 70.31
ఆస్ట్రేలియా – 69.81
యూఎస్ఏ – 69.24
నెదర్లాండ్స్ – 68.84
న్యూజీలాండ్ – 66.92
కెనడా – 66.75
నార్వే – 66.36
జర్మనీ – 65.79
యూకే – 65.75
స్వీడన్ – 65.15
మరికొన్ని ఇతర దేశాల రేటింగ్స్
చైనా – 60.65
దక్షిణాఫ్రికా – 52.19
రష్యా – 51.31
మెక్సికో – 49.41
బ్రెజిల్ – 48.56
వియత్నాం – 46.9
ఇండోనేషియా – 46.69
ఇండియా – 45.28
బంగ్లాదేశ్ – 40.71
పాకిస్తాన్ – 33.81
UNCTAD,United Nations,PCI,GDP,India
UNCTAD, United Nations, PCI, GDP, India
https://www.teluguglobal.com//business/indias-productive-capacity-is-4528-new-pci-designed-by-united-nations-941963