2025-02-20 06:33:39.0
లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి 21 మిలియన్ డాలర్లు ఎందుకు ఖర్చుచేయాలని ప్రశ్నించిన డొనాల్డ్ ట్రంప్
భారత్‌లో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి బైడెన్ ప్రభుత్వం జోక్యం చేసుకున్నదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడానికి 21 మిలియన్ డాలర్లు కేటాయించడంపై ఆయన ఈ మేరకు స్పందించారు. ఫ్లోరిడాలోని మయామిలో ఎఫ్‌ఐఐ ప్రయారిటీ సమ్మిట్ పాల్గొన్నట్రంప్ ఓటింగ్ శాతం పెంచేందుకు అమెరికా నిధులు ఎందుకు ఖర్చు పెట్టారని ప్రశ్నించారు. భారత్‌లో మరెవర్నో గెలిపించడానికి బైడెన్ యంత్రాంగం ప్రయత్నించినట్లు అర్థమౌతుందని అన్నారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. ఇతర దేశాలకు ఇచ్చే నిధుల్లో కోత విధిస్తూ ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ విభాగం ఈనెల 16న ఒక జాబితా విడుదల చేసింది. అందులో భారత్‌లో ఓటర్ల సంఖ్య పెంచడానికి ఉద్దేశించిన నిధులను కూడా రద్దు చేసినట్లు ప్రకటించారు.
Donald Trump hints,At USAID interference in India’s elections,Joe Biden administration,DOGE,Elon Musk,USD 21 million allocated