https://www.teluguglobal.com/h-upload/2025/01/25/1397557-tahawwur-rana.webp
2025-01-25 04:54:13.0
అతడిని న్యూఢిల్లీకి అప్పగించడానికి అగ్రరాజ్యం సుప్రీంకోర్టు అంగీకారం
దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో భీకర ఉగ్రదాడిని తలుచుకుంటే ఇప్పటికీ వణుకుపుడుతుంది. నాటి ఘటనలో దోషిగా తహవూర్ రాణాను అమెరికా నుంచి భారత్ తీసుకొచ్చే ప్రయత్నం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. అతడిని న్యూఢిల్లీకి అప్పగించడానికి అగ్రరాజ్యం సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు రాణా రివ్యూ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
తహవూర్ రాణా పాకిస్థాన్‌కు చెందిన కెనెడా జాతీయుడు. 26/11 ముంబయి దాడుల్లో కీలక సూత్రధారి. ప్రస్తుతం లాస్ ఏంజెలెస్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడిని తమకు అప్పగించాలని కొంతకాలంగా భారత్ పోరాడుతున్నది. దీన్ని సవాల్ చేస్తూ తహవూర్ రాణా పలు
ఫెడరల్ కోర్టులను ఆశ్రయించగా.. ఆయా న్యాయస్థానాలు అతని అభ్యర్థనను తిరస్కరించాయి. శాన్‌ఫ్రాన్సిస్కోలోని యూఎస్ కోర్టు ఆఫ్ అప్పీల్‌లోనూ చుక్కెదురైంది. దీంతో చివరి ప్రయత్నంగా గత ఏడాది నవంబర్ 13న అమెరికా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు.
ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని ఇటీవల అమెరికా ప్రభుత్వం న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు 20 పేజీల అఫిడవిట్ దాఖలు చేసింది. దీన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు.. రాణా అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో అతడిని భారత్‌కు అప్పగించడానికి మార్గం సుగమమైంది. న్యాయపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత మరికొన్నినెలల్లో అతడిని భారత్‌కు అప్పగించే అవకాశాలున్నాయి.
US Supreme Court,Clears,Mumbai terror attack,Convict Tahawwur Rana,Extradition to India