భారత పతాక

2023-08-14 22:07:45.0

https://www.teluguglobal.com/h-upload/2023/08/14/810441-indian-flag.webp

నైర్మల్య ధావళ్య నైసర్గిక ప్రభా

లావణ్య దీధితుల్ లాస్యమాడ

సస్య సుశ్యామల సౌభాగ్య సౌందర్య

మార్య సంస్తుతమై అదటు వాప

వైరాగ్య వైదుష్య వైభవ ప్రాభవ

ప్రతిభా రుణార్చులు ప్రభల బర్వ

ధర్మైక దాక్షిణ్య దక్షరక్ష స్ఫుటా

శోకచక్ర స్ఫూర్తి శోభలెనయ

వర్ణ త్రితయంబు దిగ్డిశల్ ప్రజ్వరిల్ల

ధర్మచక్రంబు చక్రమై తాండవింప

విశ్వ విఖ్యాతి గాంచిన విజయరేఖ

ప్రణతులివె నీకు భారత ప్రభుపతాక!

– డాక్టర్ గాజుల రోశయ్య

Gajula Rosaiah,Telugu Kavithalu,Indian Flag