http://www.teluguglobal.com/wp-content/uploads/2016/05/backpain.gif
2016-05-21 08:35:29.0
మనది యువభారతమనీ, మనదేశంలో యువతరం ఎక్కువగా ఉందని ఈ మధ్యకాలంలో బాగా మురిసిపోతున్నాం. కానీ ఈ వివరాలు తెలుసుకుంటే మాత్రం ఆ ఆనందం ఎంతోకొంత తగ్గకమానదు. వెన్ను బాధలతో నిపుణులను సంప్రదింస్తున్న వారిలో ప్రతి అయిదో పేషంటు 20-30ల వయసులో ఉన్న యువతేనని వైద్యనిపుణులు అంటున్నారు. పదేళ్ల క్రితం వరకు సీనియర్ సిటిజన్లలో మాత్రమే కనిపించే వెన్ను సమస్యలు ఇప్పుడు చిన్నవయసు వారికే వచ్చేస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యువతలో వెన్నెముక సమస్యలు 60శాతం వరకు […]
మనది యువభారతమనీ, మనదేశంలో యువతరం ఎక్కువగా ఉందని ఈ మధ్యకాలంలో బాగా మురిసిపోతున్నాం. కానీ ఈ వివరాలు తెలుసుకుంటే మాత్రం ఆ ఆనందం ఎంతోకొంత తగ్గకమానదు. వెన్ను బాధలతో నిపుణులను సంప్రదింస్తున్న వారిలో ప్రతి అయిదో పేషంటు 20-30ల వయసులో ఉన్న యువతేనని వైద్యనిపుణులు అంటున్నారు. పదేళ్ల క్రితం వరకు సీనియర్ సిటిజన్లలో మాత్రమే కనిపించే వెన్ను సమస్యలు ఇప్పుడు చిన్నవయసు వారికే వచ్చేస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యువతలో వెన్నెముక సమస్యలు 60శాతం వరకు పెరిగాయని వైద్యనిపుణులు వెల్లడించారు.
ఒకే భంగిమలో గంటల కొద్దీ కూర్చునే ఉద్యోగాలే యువత వెన్నుకి ఎసరు పెడుతున్నాయని వారు అంటున్నారు. వీపు కండరాలు, వెన్నెముక డిస్క్లు బలహీనమై, లిగమెంట్లు విపరీతమైన ఒత్తిడికి గురయి యువతరం తీవ్రమైన మెడ, నడుము నొప్పుల బారిన పడుతున్నదని వారు చెబుతున్నారు. న్యూఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రి వైద్యులు ఈ వివరాలు వెల్లడించారు. కూర్చోవడమే కాకుండా ఎక్కువ సమయం నిలబడటం వలన కూడా, శరీరానికి రక్త ప్రసరణ తగ్గిపోయి, కాళ్లు, వెన్ను, మెడ కండరాల్లో నొప్పులు మొదలవుతున్నాయని ఆ నిపుణులు తెలిపారు. రోజుకి నాలుగు గంటల కంటే ఎక్కువ సమయం ఒకే భంగిమలో కూర్చోవటం వెన్నుకి హాని చేసుకోవడమే అవుతుందని సీనియర్ స్పైన్ న్యూరో సర్జన్ ఒకరు వెల్లడించారు. మొబైల్ ఫోన్ల వాడకం పెరగటం వలన భారత్లో యాభైశాతం మంది పిల్లలు, యువత వెన్ను సమస్యల బారిన పడే ముప్పు ఉన్నదని ఇప్పటికే అధ్యయనాలు చెబుతున్నాయని… వైద్య నిపుణులు హెచ్చరించారు. యువతరంలో ఈ నొప్పులు తీవ్రమైన అనారోగ్యాలుగా మారి జీవితాంతం బాధించే ప్రమాదం ఉందని, అంతేకాక ఈ నొప్పుల కారణంగా వారి మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు.
https://www.teluguglobal.com//2016/05/21/భారత-యువత-వెన్నుకి-పగ/