https://www.teluguglobal.com/h-upload/2022/11/22/500x300_427342-221109.webp
2022-11-22 14:10:36.0
Weight Loss Tips In Telugu: శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం తీసుకోవడం, కాస్త వ్యాయామం, నడక ముఖ్యం. వయసు పైబడిన వాళ్లు ఎక్కువ సేపు వ్యాయామం చేయలేరు.
శరీర బరువును అదుపులో పెట్టుకుంటే.. అనేక రకాల వ్యాధులు మన దరికి చేరవని నిపుణులు చెబుతుంటారు. బరువు తగ్గించుకోవాలనే లక్ష్యంతో చాలా మంది విపరీతంగా వ్యాయామం చేస్తుంటారు. అయితే వెయిట్ లాస్ కోసం 20 శాతం వ్యాయామం చాలని, 80 శాతం మన ఆహారపు అలవాట్లను మార్చుకోవల్సి ఉంటుందని డైటీషియన్లు అంటున్నారు. ఇది వినడానికి కాస్త ఆశ్చర్యగా ఉన్నా.. ఆహారపు అలవాట్లు మార్చుకోవడం వల్ల గణనీయంగా బరువు తగ్గిన రుజువులు కూడా చూపిస్తున్నారు. శరీరంపై మన ఆహారపు అలవాట్లే అత్యధిక ప్రభావం చూపిస్తాయని వైద్యులు అంటున్నారు.
శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం తీసుకోవడం, కాస్త వ్యాయామం, నడక ముఖ్యం. వయసు పైబడిన వాళ్లు ఎక్కువ సేపు వ్యాయామం చేయలేరు. అలాంటి వాళ్లు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు అంటున్నారు. ఇది పెద్దగా కష్టమయ్యే పని కాదని.. బరువు తగ్గడానికి ఐదు ఆహార నియమాలను కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలని సూచిస్తున్నారు.
అధిక బరువు తగ్గాలని అనుకుంటే.. ముందుగా స్వీట్స్ మానేయాలి. కృత్రిమ చక్కెరలతో చేసే తీపి పదార్థాలు కూడా శరీరానికి హాని చేస్తాయి. షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ క్రియకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. ఇది శరీర బరువు పెరగడానికి కారణం అవుతుంది. అంతే కాకుండా దీర్ఘకాలికంగా డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ తీపి పదార్థాలు తీసుకోకుండా ఉండలేము అనుకునే వాళ్లు.. మితంగా బెల్లం, తేనే తీసుకోవాలి.
మైదా పిండిని పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది. ఈ పిండితో చేసే పదార్థాలు తినడం మన ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదు. బ్రెడ్, బన్, నాన్, పాస్తా లాంటివి మైదాతోనే చేస్తారు. కాబట్టి వీటిని తినడం పూర్తిగా మానెయ్యాలి. దీని బదులు గోధుమ పిండితో చేసే పదార్థాలు ఉపయోగించవచ్చు. రిఫైన్డ్ గోధుమ పిండి కాకుండా, బ్రౌన్ ఆటా ఆడటం బెటర్. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది.
ప్రతీ రోజు రెండు కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. గ్రీన్ టీ మన జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది. శరీరంలోని టాక్సిన్‌లను కూడా బయటకు పంపడానికి ఉపయోగపడుతుంది. గ్రీన్ టీ కారణంగా శరీరం డీటాక్స్ అయ్యి, రిలాక్స్ అవుతుంది.
ఇంట్లో వంటకాలు చేసే సమయంలో రిఫైన్డ్ ఆయిల్ వాడకాన్ని తగ్గించడం మంచిది. రిఫైన్డ్ ఆయిల్‌తో చేసిన పదార్థాలు తినడం వల్ల బరువు పెరుగుతారని పలు పరిశోధనలు తెలియజేశాయి. అందుకే రిఫైన్డ్ ఆయిల్ బదులు కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఉపయోగించాలి. ఆవ నూనె, వేరు శెనగ, రైస్ బ్రాన్ వంటి కోల్డ్ ప్రెస్ ఆయిల్‌ను వాడాలి.
ప్రతీ రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీళ్లు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. దీని వల్ల జీర్ణ క్రియ మెరుగు అవుతుందని చెప్తున్నారు. ఆరోగ్యకరమైన పద్దతిలో, సునాయాసంగా బరువు తగ్గాలంటే ఈ అలవాటు చేసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. దీని వల్ల టాక్సిన్‌లు శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి. చల్లిటి నీటిని తాగడం కంటే వేడి నీటిని తాగితేనే శరీరంలో ఉన్న కొవ్వులు ఎక్కువగా తొలగిపోతాయని వైద్యులు అంటున్నారు.
Health Tips,Weight Loss,Dieting,Weight Loss Tips in Telugu
Health Tips, Dieting, Weight Loss, weight loss tips without exercise and dieting in telugu, Weight Loss Tips in Telugu
https://www.teluguglobal.com//health-life-style/5-tips-to-lose-weight-without-heavy-dieting-and-exercise-357821