భారీ నష్టాలతో సూచీల ట్రేడింగ్‌

2025-02-24 04:23:06.0

అమెరికా టారిఫ్‌ భయాలకు తోడు దేశీయంగా కార్పొరేట్‌ సంస్థ డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాలు బలహీనంగా ఉండటం కారణం

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం భారీ నష్టాలతో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల మధ్య ఈ వారాన్ని నష్టాలో ప్రారంభించాయి. ఉదయం 9.50 గంటల సమయంలో సెన్సెక్స్‌ 740.12పాయింట్లు తగ్గి 74570.94 వద్ద.. నిఫ్టీ 174.50పాయింట్లు కుంగి 22621.40వద్ద ఉన్నాయి. అమెరికా టారిఫ్‌ భయాలకు తోడు దేశీయంగా కార్పొరేట్‌ సంస్థ డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాలు బలహీనంగా ఉండటం, షేర్ల అధిక విలువలు, జీడీపీ వృద్ధిపై ఆందోళనల వల్ల మదుపర్లు అత్యంత అప్రమత్తతతో వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామాలు మార్కెట్ల ప్రభావం చూపెడుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 86.58 వద్ద కొనసాగుతున్నది.

నిఫ్టీ సూచీలో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, మారుతీ సుజుకీ, ఎంఅండ్‌ఎం, సిప్లా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు లాభాల్లో కదలాడుతున్నాయి. ట్రెంట్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, ఓఎన్‌జీసీ స్టాక్స్‌ నష్టాలతో ట్రేడింగ్‌ మేదలుపెట్టాయి. ట్రంప్‌ తీసుకునే విధానపరమైన నిర్ణయాలు దేశీ ఐటీ కంపెనీలపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో ఆ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Stock Market,Sensex tanks 700 pts,Nifty breaks 22600,Mid,SmallCap indices dip 1.5%