2025-02-25 09:52:51.0
బాలీవుడ్ నటుడు గోవింద, అతని భార్య సునీతా అహుజా విడాకులు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవింద, ఆయన సతీమణి సునీతా అహుజా విడాకులు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. దంపతులిద్దరి మధ్య తరచూ విభేదాలు కారణం విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు టాక్. గత కొద్ది కాలంగా ఇద్దరి మధ్య తరుచుగా గొడవలు జరుగుతూ ఉండటంతో విడివిడిగా ఉంటున్నామని ఇటీవల ఆయన భార్య సునీతా తెలిపారు. గోవిందకు మరాఠా ఇండస్ట్రీకి చెందిన నటితో సంబంధమే కారణమని వార్తలు వస్తున్నాయి. దీంతో వీరి 37 సంవత్సరాల వివాహం బంధం తెగిపోనుంది. తాము ఇద్దరం గతకొంతకాలంగా దూరంగా ఉంటున్నామని సునీత వెల్లడించారు.
ఓ మరాఠి నటితోనే గోవింద రిలేషన్ షిప్ దీనికి కారణమని తెలుస్తోంది. గోవింద, సునీత 1987 మార్చి 11న వివాహం చేసుకున్నారు. వీరికి యశ్వర్ధన్ అహుజా, టీనా అహుజా ఇద్దరు పిల్లలున్నారు. ఈ మధ్యకాలంలో సినీ ప్రముఖుల విడాకులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో నటుడు గోవిందా కి హీరోగా మంచి గుర్తింపు ఉంది. అప్పట్లో అమితాబ్ బచ్చన్ వంటి హీరోలు కొనసాగుతున్న సమయంలోనే ఈయన తన కామెడీ సినిమాలతో అభిమానులను తన వైపు తిప్పుకున్నారు.
Bollywood,actor Govinda,divorce with his wife,Sunita Ahuja,Maratha Industry,Amitabh Bachchan,Rajinikanth,BOLLYWOOD HERO GOVINDA,SUNITHA AHUJA