భార్య, తల్లి, పిల్లల్ని చంపి.. డాక్టర్..!

https://www.teluguglobal.com/h-upload/2024/04/30/1323538-vijayawada-doctor.webp

2024-04-30 12:09:56.0

కుటుంబ సభ్యుల్ని హత్య చేసిన తర్వాత డాక్టర్ శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

విజయవాడ గురునానక్ కాలనీలో ఘోరం జరిగింది. డాక్టర్‌ ఫ్యామిలీలో ఐదుగురు అనుమానాస్పద స్థితిలో చనిపోవడం సంచలనంగా మారింది. నగరానికి చెందిన ఆర్థోపెడిక్ సర్జన్‌ శ్రీనివాస్‌ ఇంట్లో ఐదుగురు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఇంటి ఆవరణలో చెట్టుకు ఉరేసుకున్న స్థితిలో డాక్టర్ శ్రీనివాస్ మృతదేహం ఉంది. మృతుల్లో శ్రీనివాస్‌ భార్య ఉషారాణి, ఇద్దరు పిల్లలు శైలజా, శ్రీయాణ్…తల్లి రమణమ్మ ఉన్నారు.

కుటుంబ సభ్యుల్ని చంపి..

కుటుంబ సభ్యుల్ని హత్య చేసిన తర్వాత డాక్టర్ శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల గొంతుకోసి అనంతరం అతను ఉరి వేసుకుని చనిపోయారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.

ఆర్థిక సమస్యలే కారణమా..?

ఆర్థిక సమస్యలతో డాక్టర్ శ్రీనివాస్‌ తన ఆస్పత్రిని లీజుకు ఇచ్చినట్టు తెలుస్తోంది. అయినా సమస్య తీరలేదు. దీంతో ఒత్తిడి భరించలేక కుటుంబ సభ్యుల్ని హతమార్చి ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Dr Srinivas,Vijayawada,Suicide