2022-07-04 21:10:36.0
ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టుంది చంద్రబాబు, పవన్ కల్యాణ్ పరిస్థితి. ఏపీలో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలకు ఒకరికి ఆహ్వానం లేదు, ఇంకొకరికి వెళ్లడానికి మొహం చెల్లలేదు. ఈ దశలో వీరిద్దర్నీ టార్గెట్ చేసి సెటైర్లు పేల్చారు మంత్రి రోజా. జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీతో కలసి వేదికను పంచుకున్న ఆమె సెల్ఫీ దిగి సందడి చేశారు, ఆ తర్వాత బాబు, పవన్ కి చాకిరేవు పెట్టారు. విచిత్రం ఏంటంటే.. పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో […]
ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టుంది చంద్రబాబు, పవన్ కల్యాణ్ పరిస్థితి. ఏపీలో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలకు ఒకరికి ఆహ్వానం లేదు, ఇంకొకరికి వెళ్లడానికి మొహం చెల్లలేదు. ఈ దశలో వీరిద్దర్నీ టార్గెట్ చేసి సెటైర్లు పేల్చారు మంత్రి రోజా.
జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీతో కలసి వేదికను పంచుకున్న ఆమె సెల్ఫీ దిగి సందడి చేశారు, ఆ తర్వాత బాబు, పవన్ కి చాకిరేవు పెట్టారు.
విచిత్రం ఏంటంటే.. పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో భీమవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు అదే భీమవరంలో మోదీ సభ విజయవంతం అయిందని, దీంతో భీమ్లా నాయక్ బిగుసుకుపోయారని చెణుకులు విసిరారు రోజా.
భీమ్లా బిగుసుకుపోగా, బాబు నీరుగారిపోయారని అన్నారు. మోదీకి జగన్ స్వాగతం పలకడం, మోదీ కూడా జగన్ పై అభిమానాన్ని చూపడం.. ఇవన్నీ పచ్చపార్టీ నేతలకు మింగుడుపడటంలేదని అన్నారు రోజా.
జాకీలు సరిపోవట్లేదు..
పవన్ కల్యాణ్, లోకేష్ ని జాకీలు వేసి పైకి లేపాలని చూస్తున్నారని, కానీ ఆ జాకీలు విరిగిపోతున్నాయే తప్పితే వీరు మాత్రం పైకి లేవడంలేదని అన్నారు రోజా. అధికారంలో వస్తే సంక్షేమ పథకాలు ఆపేస్తామని, సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ రద్దు చేస్తామని టీడీపీ నేతలు ప్రకటిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధిని ఆపేసే వాళ్లు కావాలా.. సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు మేలు చేసేవారు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు రోజా.
Andhra Pradesh,Chandrababu Naidu,Minister Roja,Pawan Kalyan,slams