2016-05-12 05:53:21.0
వేసవిలో నీళ్లు ఎక్కువగా తాగుతుంటాం. అవే నీటిని రుచికరంగా, పౌష్టికంగా తాగవచ్చు. చాలా తేలికగా మంచినీటికి మంచి రుచిని, పోషకవిలువలను జోడించే పద్ధతులు ఇవి. ఇలా తయారు చేసుకున్న నీరు బరువు తగ్గేందుకు సైతం దోహదం చేస్తుంది…ఇంతకీ ఏం చేయాలి… -పళ్లను అలాగే తినాలన్నా, రసం తీసుకుని తాగాలన్నా బద్దకించేవారికి ఇది మంచి పద్ధతి. పుచ్చకాయ, స్ట్రాబెర్రీ, కివి పళ్లను ముక్కలుగా చేసి వాటర్ బాటిల్‌లో వేసేయండి. కొన్ని గంటలు అలాగే వదిలేస్తే రుచికరమైన పళ్ల ఫ్లేవర్, […]
వేసవిలో నీళ్లు ఎక్కువగా తాగుతుంటాం. అవే నీటిని రుచికరంగా, పౌష్టికంగా తాగవచ్చు. చాలా తేలికగా మంచినీటికి మంచి రుచిని, పోషకవిలువలను జోడించే పద్ధతులు ఇవి. ఇలా తయారు చేసుకున్న నీరు బరువు తగ్గేందుకు సైతం దోహదం చేస్తుంది…ఇంతకీ ఏం చేయాలి…
-పళ్లను అలాగే తినాలన్నా, రసం తీసుకుని తాగాలన్నా బద్దకించేవారికి ఇది మంచి పద్ధతి. పుచ్చకాయ, స్ట్రాబెర్రీ, కివి పళ్లను ముక్కలుగా చేసి వాటర్ బాటిల్‌లో వేసేయండి. కొన్ని గంటలు అలాగే వదిలేస్తే రుచికరమైన పళ్ల ఫ్లేవర్, పోషకాలు ఉన్న మంచినీళ్లు రెడీ అవుతాయి.
-మంచినీటిలో ఒక గుప్పుడు పుదీనా, నిమ్మముక్కలు, కీర దోసకాయను వేసి…రెండు గంటలు వదిలేస్తే మన శరీరంలోని విషాలను హరించే అమృతం తయారవుతుంది. అలా ఎన్ని బాటిల్సయినా తయారుచేసుకోవచ్చు.
-జీరో కేలరీల డ్రింక్ కావాలంటే ఇలా చేయండి. పలుచగా కట్ చేసిన యాపిల్ ముక్కలు, కొన్ని దాల్చిన చెక్క ముక్కలను నీటిలో వేయండి. ఈ నీటిని ఫ్రిజ్‌లో ఉంచండి. మరికాస్త స్ట్రాంగ్ రుచి కావాలంటే మరిన్ని యాపిల్ ముక్కలు, దాల్చిన చెక్కని కలపాలి.
-శరీరంలోంచి విషాలు బయటకు పోయి రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడాలని ఆశించేవారు అలోవేరా ఆకునుండి తాజా గుజ్జుని తీసుకుని దానికి సమానంగా నిమ్మరసం కలిపి ఒక కప్పునీళ్లలో కలుపుకుని తాగాలి. ఈ డ్రింక్ కొలెస్ట్రాల్‌ని బ్లడ్ సుగర్‌ని కూడా అదుపులో ఉంచుతుంది.
-అల్లంలో నొప్పిని తగ్గించే, శరీరంలోని విషాలను హరించే గుణం ఉంది. ఒక బాటిల్ నీటిలో అరచెక్క నిమ్మరసం, సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేయాలి. అయితే ఇందుకోసం తాజా అల్లాన్నే వాడాలి. ఉదయాన్నే ఈ నీటిని తాగితే మరింత మంచిది.
-పుచ్చకాయలో విటమిన్లు, మినరల్స్ ఎక్కువ. శరీరంలోని విషాలను బయటకు పంపటంలో బాగా తోడ్పడుతుంది. పుచ్చకాయ ముక్కలను నీటిలో కలిపి, కొన్ని గంటలు ఫ్రిజ్లో ఉంచి తాగితే ఈ లాభాలన్నీ పొందవచ్చు.
https://www.teluguglobal.com//2016/05/12/మంచినీళ్లు-మాంచి-రుచిక/