https://www.teluguglobal.com/h-upload/2023/10/08/500x300_837320-sleep.webp
2023-10-08 10:15:07.0
పొద్దున్నపూట అంతా ఉరుకుల పరుగుల జీవితం ఉండనివ్వండి.. కానీ రాత్రి అయ్యేసరికి ప్రశాంతమైన నిద్ర ఉంటే చాలు అది మనిషిని రీచార్జ్ చేస్తుంది.
పొద్దున్నపూట అంతా ఉరుకుల పరుగుల జీవితం ఉండనివ్వండి.. కానీ రాత్రి అయ్యేసరికి ప్రశాంతమైన నిద్ర ఉంటే చాలు అది మనిషిని రీచార్జ్ చేస్తుంది. అందుకే ఉదయపు అలసటని దూరం చేసేంత గాఢ నిద్ర కోరుకోని వారు ఉండరు. కానీ చాలామంది రాత్రివేళ నిద్రపట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు. అందరూ నిద్ర పోయినా కూడా అటు ఇటు తిరుగుతూ నిద్ర ఎప్పుడు వస్తుందా అన్నట్టు ఎదురు చూస్తుంటారు.
ఇక నిద్ర కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగే వారు, స్లీపింగ్ పిల్స్ కు అలవాటు పడిన వారు కూడా ఉన్నారు. ఎందుకంటే మంచి నిద్ర లేకపోవడం వల్ల జీవక్రియ బలహీనపడటం ప్రారంభమవుతుంది. ఇది అన్ని సమయాలలో అలసట, మలబద్ధకానికి బరువు పెరగటం వంటి సమస్యలకు దారితీస్తుంది.
సరిగ్గా నిద్రపోకపోతే రోజంతా బద్ధకంగా, నీరసం, తలనొప్పి, ఏ పనీ పూర్తి ఏకాగ్రతతో చెయ్యలేకపోవటం చిరాకు, కోపం ఇలా ఎన్నో సమస్యలు. మనిషికి సరిపడా నిద్ర పట్టకపోతే క్రమంగా రోగాల బారిన పడటం ఖాయమంటున్నారు వైద్య నిపుణులు.
ఒకవేళ మీకు కూడా అలాంటి సమస్య ఉంటే మీరు ముందుగా దానికి గల కారణాలను అర్థం చేసుకోవాలి. ఒత్తిడి, థైరాయిడ్, స్లీప్ అప్నియా, వీటితోపాటు సోషల్ మీడియా వ్యసనం ఇంకా ఎన్నెన్నో. వీటిలో మీ సమస్యకు కారణం ఏంటో ముందుగా కనుక్కోండి. కారణం ఆరోగ్యపరమైనది అయితే డాక్టర్ని సంప్రదించక తప్పదు. కానీ అప్పుడు కూడా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు.

మీకు గాఢ నిద్ర కావాలంటే, తిన్న వెంటనే నిద్రపోకండి. మంచి నిద్ర కోసం, రాత్రి భోజనం చేసిన తరువాత కనీసం 2 గంటలు మెలుకువగా ఉండాలి. పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగితే మంచి నిద్ర పడుతుంది.
మీరు నిద్రలేమితో బాధపడుతుంటే చెర్రీస్‌ని మీ డైట్‌లో చేర్చుకోవచ్చు. ఎందుకంటే చెర్రీస్‌లో మెలటోనిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి విశ్రాంతినిస్తుంది. అవకాశం ఉన్నంతవరకు రోజూ ఒకే సమయానికి నిద్రపోండి. వీటితో పాటు ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను మీ దగ్గరనుంచి తీసేసి అప్పుడు మాత్రమే నిద్రకు సిద్ధం అవ్వండి.
Sleep,Health Tips,Sleeping
sleep, health, health tips, good sleep, news, telugu news, telugu global news
https://www.teluguglobal.com//health-life-style/how-to-have-good-sleep-966430