2024-05-28 18:03:56.0
ఎవరెస్ట్ శిఖరం అధిరోహించాలనే ఉత్సాహం ఎనిమిది మంది ప్రాణాలు తీసింది. ఇందులో ఒక భారతీయుడు కూడా ఉన్నాడు.
ఎవరెస్ట్ శిఖరం అధిరోహించాలనే ఉత్సాహం ఎనిమిది మంది ప్రాణాలు తీసింది. ఇందులో ఒక భారతీయుడు కూడా ఉన్నాడు. అక్కడి ప్రతికూల పరిస్థితులు, అనారోగ్యం కారణంగా పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోతుండటం కలవరపెడుతోంది.
చుట్టూ దట్టమైన మంచు, ఎముకలు కొరికే చలి, పైకెళ్లే కొద్ది తగ్గిపోయే ప్రాణవాయువు, అయినా సరే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలి అనేది పర్వాతారోహణ చేసేవారందరి కల. అయితే ఈ పర్వతారోహకులకు ఎదురయ్యే సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. అయినా సరే ఎంతోమంది తమ ప్రయత్నాలు తాము చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఎవరెస్ట్‌పై అధిరోహణ సీజన్ ప్రారంభమైన వెంటనే వందలాది మంది అధిరోహకులు ఎక్కడం ప్రారంభించారు. అయితే ఈ క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు.
ఈ సీజన్‌లో ఇది ఎనిమిదవ మృతి అని నేపాల్ అధికారులు వెల్లడించారు. బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తితో పాటు ఇద్దరు నేపాలీ షెర్పాలు కనపడకుండా పోవటంతో వారూ మరణించినట్లుగానే భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఎవరెస్ట్‌పై ట్రాఫిక్ జామ్ అయినట్టుగా కనిపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఓ పర్వతారోహకుడు ఎవరెస్ట్ ను అధిరోహించి కిందకి దిగుతుండగా కనపడుతున్న అతి పెద్ద లైన్లను వీడియొ తీసి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. సుమారు 500 మంది పర్వతారోహకులు తనకు ఎదురుగా వస్తున్నారని , అయితే వారిలో 250 నుంచి 300 మండి మాత్రం ఎవరెస్ట్ ను అధిరోహిస్తారని చెప్పారు. ఎందుకంటే 1953లో మొదలైన ఎవరెస్ట్ పర్వతారోహణ నుంచి ఇప్పటివరకు సుమారు 7 వేల మంది మాత్రమే శిఖరంపైకి చేరుకున్నారని, ఎవరెస్ట్ ను అధిరోహించడం అంట సుళువు కాదని చెప్పాడు.
ఎవరెస్టు పర్వతారోహణలో సంభవించే మరణాలన్నీ 8వేల మీటర్ల ఎత్తులో ‘డెత్ జోన్’గా పేరున్న ప్రాంతంలోనే జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్ తక్కువ. ప్రతికూల వాతావరణంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉంది. అంతే కాదు విపరీతమైన గాలులవల్ల పర్వతారోహకులు జారిపదే అవకాశం కూడా ఉంది.

Mount Everest,Mount Everest climbing season,Mount Everest climbing 2024,Mount Everest death toll