2025-01-15 08:55:04.0
https://www.teluguglobal.com/h-upload/2025/01/15/1394673-monoj.webp
హీరో మంచు మనోజ్‌కు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు
నటుడు మంచు మనోజ్‌కు పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి మనోజ్ వస్తారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని నోటీసులో పేర్కొన్నారు. యూనివర్సిటీకి మంచు మనోజ్ వస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే యూనివర్సిటీలో మోహన్ బాబు, మంచు విష్ణు ఉన్నారు. దీంతో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు యూనివర్సిటీ గేటు వద్ద వేచి ఉన్నారు.
ఇక మంచు మనోజ్ కుటుంబ సమేతంగా హైదరాబాద్ నుంచి తిరుపతి చేరుకుని, రేణిగుంట ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డుమార్గంలో ర్యాలీగా మోహన్ బాబు యూనివర్సిటీకి బయల్దేరారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు యూనివర్సిటీ పరిసరాల్లో ఎవ్వరినీ అనుమతించడం లేదు. గేట్లను కూడా మూసివేయడంతో యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Manchu Manoj,Tirupati,Mohan Babu University,Mohan Babu,Renigunta Airport,Manchu vishnu,Manchu laxmi