2024-12-11 12:47:21.0
https://www.teluguglobal.com/h-upload/2024/12/11/1385044-mohan.webp
మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వివాదంలో మోహన్ బాబు మేనేజర్ వెంకట కిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు
మంచు మనోజ్‌పై దాడి కేసులో మోహన్ బాబు మేనేజర్ వెంకట కిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మనోజ్‌పై దాడి చేసినందుకు గాను కిరణ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హీరో విష్ణు ప్రధాన అనుచరుడిగా అతని గుర్తించారు. మూడు రోజుల క్రితం తనపై దాడి చేశారని మంచు మనోజ్ కిరణ్, వినయ్‌లపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు ఇంటి వద్ద మాయమైన సీసీ ఫుటేజ్‌పై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
కాగా మూడు రోజులుగా మంచు కుటుంబంలో జరిగిన గొడవలు రాష్ట్ర వ్యాప్తంగా తారా స్థాయికి చేరాయి. విజయ్ రెడ్డి అనే వ్యక్తితో కలిసి వెంకట్ కిరణ్ సీసీ టీవీ ఫుటేజి మాయం చేసినట్టు గుర్తించారు. మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మంచు మనోజ్, మోహన్ బాబు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసుకున్నారు. తనపై 10 మంది వ్యక్తులు దాడి చేశారని, విజయ్, వెంకట్‌కిరణ్ సీసీటీవీ పుటేజ్ తీసుకెళ్లారని ఇటీవల మనోజ్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. మనోజ్‌పై దాడి కేసులో తాజాగా మోహన్ బాబు మేనేజర్ వెంకట్ కిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Manchu Vishnu,Manager Venkata Kiran,Manchu Manoj,Mohan Babu,Jalpally Mohan Babu House,Bhuma maunika,Manchu Lakshmi