2024-11-27 11:57:13.0
మర్యాద పూర్వకంగా సమావేశమైన బీఆర్ నాయుడు
తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు బుధవారం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో భేటీ అయ్యారు. అసెంబ్లీ ఆవరణలోని స్పీకర్ చాంబర్ లో ఆయన చైర్మన్, స్పీకర్ తో మర్యాద పూక్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడును చైర్మన్, స్పీకర్ ఘనంగా సత్కరించారు. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను శ్రీవారి బ్రేక్ దర్శనంతో పాటు ఇతర సేవలకు పరిగణలోకి తీసుకోవాలని చైర్మన్, స్పీకర్ సూచించారు. ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడి త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటానని నాయుడు తెలిపారు. కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
TTD Chairman,BR Naidu,Council Chairman Gutta Sukendar Reddy,Speaker Gaddam Prasad Kumar,Telangana Assembly