2024-09-30 17:12:47.0
ఆయన తండ్రి చిత్రపటం వద్ద నివాళులు
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం రాత్రి పరామర్శించారు. మంత్రి తండ్రి పురుషోత్తం రెడ్డి ఆదివారం మృతిచెందారు. కొండిపూర్ లోని మంత్రి ఇంటికి వెళ్లి పురుషోత్తం రెడ్డి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఉత్తమ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని పరామర్శించారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, నాయకులు కార్తీక్ రెడ్డి, విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.
utham kumar reddy,his father,expired,ktr consled