2025-02-11 13:53:51.0
మంత్రులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు
మంత్రులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో మంత్రులు, కార్యదర్శుల సమావేశానికి ముఖ్యమంత్రి ఐదు నిమిషాలు ముందుగానే చేరుకున్నారు. సీఎం వచ్చినా కార్యదర్శులు, మంత్రులు నిర్ణీత సమయానికి సమావేశానికి హాజరు కాలేదు. వారి కోసం సీఎం 10 నిమిషాలపాటు ఐదో బ్లాక్‌లో వేచి ఉన్నారు.
ప్రజా వ్యవహారాల్లో సమయపాలన పాటించకపోవటంపై అందరికీ సీఎం క్లాస్ తీసుకున్నారు. ఇక నుంచి ఈ తరహా వ్యవహారాలను సహించబోమని స్పష్టం చేశారు. స్మార్ట్ వర్క్ చేస్తూనే సమయ పాలన కూడా పాటించాలని మంత్రులు, అధికారులకు సూచించారు. ఇక నుంచి ఇలాంటివి సహించేది లేదని చంద్రబాబు తెేల్చిచెప్పారు.
CM Chandrababu,Secretariat,ministers,TDP,Naralokesh,Andhra Pradesh News,Amaravati News