మంత్రుల తీరుపై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అసహనం

2024-11-16 02:57:03.0

ప్రశ్నోత్తరాల సమయాన్ని మంత్రులు సీరియస్‌గా తీసుకోవాలని ..వారే సభకు ఆలస్యంగా వస్తే ఎలా? ప్రశ్నించిన స్పీకర్‌

https://www.teluguglobal.com/h-upload/2024/11/16/1378231-ayyanna.webp

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రుల తీరుపై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అసహనం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని మంత్రులు సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. మంత్రులే సభకు ఆలస్యంగా వస్తే ఎలా? సరైన సమయానికి రావడానికి ప్రయత్నించాలన్నారు. తణుకు ఈఎస్‌ఐ ఆస్పత్రిపై అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మంత్రి సుభాష్‌ అందుబాటులో లేరు. దీంతో స్పీకర్‌ ఇలా స్పందించారు. డిస్కం కొనుగోళ్లలో అక్రమాలపై అడిగిన ప్రశ్నను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. కడపలో తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి ప్రశ్న అడిగారు. ఆమె విప్‌గా ఉండటంతో ప్రశ్న అడగడానికి నిబంధనలు అంగీకరించవని అయ్యన్నపాత్రుడు వివరించారు.